France: ఫ్రాన్స్‌లో ఆగని అల్లర్లు..

by Vinod kumar |
France: ఫ్రాన్స్‌లో ఆగని అల్లర్లు..
X

పారిస్ (ఫ్రాన్స్‌) : ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన 17 ఏళ్ల యువకుడిని పోలీసులు మంగళవారం కాల్చి చంపిన ఘటనపై ఫ్రాన్స్ అట్టుడుకుతోంది. పారిస్‌ శివారు ప్రాంతాల్లో మొదలైన అల్లర్లు శుక్రవారం ఉదయం నాటికి దేశమంతా పాకాయి. నిరసనకారులు అనేక నగరాల్లో పోలీసులతో ఘర్షణకు దిగారు. పాఠశాలలు, దుకాణాలు, బ్యాంకులకు నిప్పు పెట్టారు. ఈ అల్లర్లలో 250 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. ఈక్రమంలో ఫ్రాన్స్ అంతటా 875 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఎక్కువ మంది 14 నుంచి 18 ఏళ్ల మధ్యవారే ఉండటం గమనార్హం.

ఈ హింసను అణచివేసేందుకు ఎలైట్ రైడ్, జీఐజీఎన్ విభాగాలతో సహా 40,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించామని ఫ్రాన్స్ హోం శాఖ మంత్రి గెరాల్డ్ డార్మానిన్ తెలిపారు. పారిస్‌ శివారులోని క్లామర్ట్‌ పట్టణంలో గురువారం రాత్రి కర్ఫ్యూ విధించారు. ఇక యువకుడిపై కాల్పులు జరిపిన పోలీసు అధికారిపై విచారణ ప్రారంభమైంది. ఆ పోలీసు అధికారిపై హత్యాభియోగాలు నమోదయ్యాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రశాంతంగా ఉండాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed