మరోసారి మనోజ్ జరాంగే ఆమరణ దీక్ష..షిండే ప్రభుత్వానికి వార్నింగ్

by vinod kumar |
మరోసారి మనోజ్ జరాంగే ఆమరణ దీక్ష..షిండే ప్రభుత్వానికి వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: మరాఠా రిజర్వేషన్ల డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. మరాఠా రిజర్వేషన్ ఉద్యమ నేత మనోజ్ జరాంగే పాటిల్ మళ్లీ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. జల్నాలోని సైరత్ గ్రామంలో శనివారం దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా జరాంగే మాట్లాడుతూ..మరాఠా రిజర్వేషన్లు కల్పించకపోతే.. ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. మొత్తం 288 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో నిలుపుతామని తెలిపారు. ఈ అంశానికి సంబంధించి అధికార మహాయుతి కూటమి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి ఏమీ మాట్లాడటం లేదని విమర్శించారు.

షిండే ప్రభుత్వం మరాఠాలను తప్పుదోవ పట్టించిందని, దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మరాఠా రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైనే ఉందని స్పష్టం చేశారు. కాగా, లోక్‌సభ ఎన్నికలకు ముందు కూడా మనోజ్ జరాంగే రెండుసార్లు జనవరి 20 నుంచి 27, ఫిబ్రవరి 10 నుంచి 26 మధ్య నిరాహారదీక్ష చేశారు. అప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని షరతులకు అంగీకరించి నిరాహార దీక్షను విరమించేలా చేసింది. అయితే జూన్ 4లోగా రాష్ట్ర ప్రభుత్వం మరాఠా రిజర్వేషన్ సమస్యను పరిష్కరించకుంటే నిరాహారదీక్ష చేస్తానని ఈ ఏడాది ఏప్రిల్‌లో పాటిల్ చెప్పారు. ఈ నేపథ్యంలనే దీక్ష ప్రారంభించారు. అయితే దీనికి అనుమతి లేదని మహారాష్ట్ర పోలీసులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed