- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Omar Abdullah: వాజ్‌పేయి బతికుంటే కశ్మీర్ యూటీగా మారేది కాదు.. సీఎం ఒమర్ అబ్దుల్లా
దిశ, నేషనల్ బ్యూరో: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయిపై జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar abdhullah) ప్రశంసలు కురిపించారు. వాజ్ పేయి బతికుంటే కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం(UT)గా మారేది కాదని చెప్పారు. ఆయన విధానాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరించి ఉంటే కశ్మీర్ పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఒమర్ అబ్లుల్లా ప్రసంగించారు. కశ్మీర్‌లో పరిస్థితిని మెరుగుపరచడానికి వాజ్‌పేయి ఎల్లప్పుడూ ప్రయత్నించారన్నారు. ‘2000 సంవత్సరంలో వాజ్ పేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు కశ్మీర్ ప్రభుత్వం తీసుకొచ్చిన స్వయం ప్రతిపత్తి తీర్మానాన్ని ఆయన వెనక్కి పంపారు. కానీ తర్వాత తన తప్పు గ్రహించి ప్రభుత్వంతో మాట్లాడారు’ అని తెలిపారు. అంతేగాక ఈ విషయంపై చర్చించేందుకు ఓ మంత్రిని సైతం నియమించారని గుర్తు చేశారు. వాజ్‌పేయి గొప్ప దార్శనికుడని, లాహోర్ బస్సును ప్రారంభించి మినార్-ఎ-పాకిస్థాన్‌ను సందర్శించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.