ఎన్నికలవేళ కేంద్రం గుడ్ న్యూస్.. గ్యాస్ సిలిండర్లపై భారీగా తగ్గింపు

by Shamantha N |
ఎన్నికలవేళ కేంద్రం గుడ్ న్యూస్.. గ్యాస్ సిలిండర్లపై భారీగా తగ్గింపు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల వేళ చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గించినట్లు ప్రకటించాయి. కమర్షియల్ సిలిండర్ ధరపై రూ.69.50 తగ్గగా.. ఇది జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది. కమర్షియల్ సిలిండర్ పై వరుసగా మూడోసారి ధరలు తగ్గించడం గమనార్హం. అంతకుముందు మేలో రూ.19, ఏప్రిల్ లో రూ.31 చొప్పున రేట్లను తగ్గించింది. దీంతో, దేశరాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1676కి చేరింది. హైదరాబాద్ లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1975.50 గా ఉంది. ముంబైలో ఒక్కో గ్యాస్ సిలిండర్ రేటు రూ. 1629 వద్ద ఉంది. చెన్నైలో రూ. 1841.50, కోల్‌కతాలో రూ. 1789.50 వద్ద కొనసాగుతోంది.

యథాతథంగా డొమెస్టిక్ సిలిండర్ ధరలు

అయితే, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం యథాతథంగా ఉన్నాయి. ఆ ధరల్లో మార్పులేమీ చేయలేదు. గతంలో రెండు సార్లు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రేట్లను కేంద్రం భారీగా తగ్గించింది. రాఖీ సందర్భంగా రూ.200 తగ్గించగా.. మహిళా దినోత్సవం సందర్భంగా రూ.100 తగ్గించింది. దీంతో సిలిండర్ రేటు రూ.1155 నుంచి రూ.855కి చేరింది. అందుకే డొమెస్టిక్ సిలిండర్ ధరలను తగ్గించలేదని తెలుస్తోంది.

Advertisement

Next Story