- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Odisha: హృదయవిధారక ఘటన.. పింఛన్ కోసం 2 కిలోమీటర్లు దేకిన వృద్దురాలు
దిశ, డైనమిక్ బ్యూరో: 70 ఏళ్ల వృద్దురాలు పింఛన్ కోసం రెండు కిలోమీటర్లు నేలపై దేకుతూ వెళ్లిన హృదయవిధారక ఘటన ఒడిస్సాలో చోటుచేసుకుంది. ఘటన ప్రకారం ఒడిస్సా సీఎం మోహన్ చరణ్ మాఝి సొంత జిల్లా అయినా కియోంఝర్ సమీపంలో తెల్కొయి సమితి రాయిసువా అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో పంచాయితీ సమితి కార్యాలయం ఊరికి బయట ఉంది. దీంతో ఏ పని కావాలన్న ఊరి నుంచి రెండు కిలోమీటర్లు మట్టి రోడ్డులోనే వెళ్లాలి. ఈ నేపథ్యంలోనే అదే గ్రామానికి చెందిన పాధురి దేహురి అనే 70 ఏళ్ల వృద్దురాలు నడవలేని స్థితిలో ఉంది.
ఆమె వృద్దాప్య పింఛన్ కోసం బురద దారిలో రెండు కిలోమీటర్లు దేకుతూ వెళ్లింది. నడవలేని స్థితిలో కాళ్లు చేతులు నేలపై ఉంచి ఒక్కో అడుగు వేసుకుంటు పంచాయితీ కార్యాలయానికి చేరుకుంది. ఆమె దీన స్థితిని ఓ వ్యక్తి చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇందులో వృద్ధురాలి దీన స్థితి నెటిజన్ల మనసులకు కలిచివేసింది. పాపం.. ఆ అవ్వకు ఎంత కష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ల కోసం అయినా ప్రభుత్వాలు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని, సిబ్బంది నేరుగా వెళ్లి పింఛన్ అందించే సదుపాయాలు కల్పించాలని కామెంట్లు చేస్తున్నారు.