- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎన్నికల బరిలో నుపూర్ శర్మ.. క్లారిటీ ఇచ్చిన సీఎం
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఓ కమ్యూనిటీ పై వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన వీడియో చేసిన నుపూర్ శర్మను బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఆమెపై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేసి ఎన్నికల్లో పోటీ చేయిస్తారనే వార్తలు వచ్చాయి. దీనిపై అస్సాం సీఎం శర్మ క్లారిటీ ఇచ్చారు. తన ట్విట్టర్ ఖాతాలో హిందూ సోదరి తిరిగి వస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తుందని ఆయన రాసుకొచ్చారు.
ఇదిలా ఉంటే ఉత్తర ప్రదేశ్ లో ఉన్న రాయ్‌బరేలీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి గెలుస్తూ వస్తుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతం నుంచి సోనియా గాంధీ విజయం సాధించారు. కానీ అనూహ్యంగా ఆమె ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మహిళా నేతను పోటీలోకి దించే ప్రయత్నం చేస్తుండటంతో అందరి చూపు ప్రస్తుతం రాయ్‌బరేలీ పై పడింది. కాగా నుపూర్ శర్మ సస్పెన్షన్ ఎత్తివేత, ఎన్నికల్లో పోటీపై బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.