Ajit Doval: ఉక్రెయిన్ లో శాంతి కోసం భారత్ ప్రయత్నాలు.. మాస్కోలో అజిత్ దోవల్ పర్యటన

by Shamantha N |   ( Updated:2024-09-08 06:50:46.0  )
Ajit Doval: ఉక్రెయిన్ లో శాంతి కోసం భారత్ ప్రయత్నాలు.. మాస్కోలో అజిత్ దోవల్ పర్యటన
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు భారత్ ముందడుగు వేస్తోంది. అందులోభాగంగానే జాతీయ భద్రతా సలహాదారు(NSA) అజిత్‌ దోవల్ రష్యాలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 10 నుండి 11 వరకు ఆయన మాస్కోలో పర్యటించనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో(Russian President Vladimir Putin) సమావేశమవుతారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని(Russia-Ukraine war) పరిష్కరించే లక్ష్యంతో శాంతి ప్రయత్నాలపై చర్చ జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన బ్రిక్స్‌ జాతీయ భద్రతాదారుల సదస్సులో(BRICS-NSA meeting) పాల్గొననున్నారు.

రష్యా, చైనా ఉన్నాతాధికారులతో భేటీ

అదే సమయంలో రష్యా, చైనా ఉన్నాతధికారులతో అజిత్ దోవల్ అధికారులతో ఆయన భేటీ కానున్నారు. బ్రిక్స్‌ ఎన్‌ఎస్‌ఏల సదస్సు సమయంలో ఉక్రెయిన్‌ శాంతి కోసం అనుసరించే అవకాశాల గురించి చర్చిస్తారని సమాచారం. గత నెల రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi టెలిఫోన్‌ సంభాషణ సమయంలో దోవల పర్యటన అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో మోడీ ఉక్రెయిన్‌ లో పర్యటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చర్చల సందర్భంగా మాట్లాడుతూ.. చర్చలు, దౌత్యమే యుద్ధానికి పరిష్కార మార్గాలని సూచించారు. ఉక్రెయిన్‌ శాంతి కోసం రష్యాతో మధ్యవర్తిత్వం చేస్తానని ఆఫర్‌ చేశారు. ‘‘ఈ యుద్ధంలో భారత్‌ ఏమాత్రం తటస్థంగా లేదు.. కేవలం శాంతి వైపే ఉన్నాం’’ అని మోడీ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed