- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ajit Doval : పుతిన్‌తో అజిత్ దోవల్ భేటీ.. రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలపై ప్రస్తావన
దిశ, నేషనల్ బ్యూరో : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ గురువారం సాయంత్రం మాస్కోలో భేటీ అయ్యారు. ఇటీవలే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలను పుతిన్‌కు ఆయన వివరించారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే అంశాన్ని తెలియజేసేందుకు తాను మాస్కోకు వచ్చినట్లు దోవల్ తెలిపారు. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సదస్సులో పాల్గొనేందుకు ఇటీవలే దోవల్ మాస్కోకు వచ్చారు. ఈసందర్భంగా భారత ప్రధాని మోడీ సూచన మేరకు పుతిన్‌తో భేటీ అయిన దోవల్.. శాంతిచర్చల అంశాన్ని ప్రస్తావించారు.
పుతిన్ స్పందిస్తూ.. అక్టోబరు 22న రష్యాలోని కజన్‌లో జరగనున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోడీతో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తానని చెప్పారు. గతంలో మోడీతో చర్చించిన అంశాలు, భవిష్యత్తులో శాంతి చర్చలకు సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఆ మీటింగ్‌లో మాట్లాడుతానన్నారు. ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చల కోసం చొరవ చూపుతున్నందుకు భారత్‌కు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు.