- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
High Court: కోడలిని టీవీ చూడనివ్వకపోవడం, కిందపడుకోమనడం క్రూరత్వం కాదు
దిశ, నేషనల్ బ్యూరో: ఐపీసీ 498A కేసుకు సంబంధించి బాంబే హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. క్రూరత్వానికి (Cruelty) పాల్పడిన కేసులో 20 ఏళ్ల శిక్షను ఎదుర్కొంటున్న కుటుంబానికి బాంబే హైకోర్టు(Bombay High Court) ఊరటనిచ్చింది. క్రూరత్వం, ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తిని, అతడి కుటుంబాన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఔరంగబాద్ బెంచ్ తీర్పు చెప్పింది. భార్య పట్ల క్రూరత్వానికి పాల్పడ్డాడనే కేసులో వ్యక్తితో పాటు అతడి కుటంబసభ్యులకు 20 ఏళ్ల శిక్ష పడింది. అయితే, ఐపీసీ 498A ( Indian Penal Code Section 498A) కింద నిందలువేయడం, పరిమితులు విధించడం తీవ్రమైన క్రూరత్వం కాదని కోర్టు తీర్పు చెబుతూ శిక్షని రద్దు చేసింది. భార్యని అవహేళన చేయడం, టీవీ చూడనివ్వకపోవడం, ఒంటరిగా ఆలయాన్ని సందర్శించకుండా చేయడం, కింద పడుకునేలా చేయడం వంటి ఆరోపణలు భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 498A ప్రకారం “తీవ్రమైన” చర్యలు కాదని కోర్టు గుర్తించింది.
అసలు కేసు ఏంటంటే?
క్రూరత్వం, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు ఐపీసీ సెక్షన్లు 498A, 306 కింద ఒకరికి దిగువ కోర్టు దోషిగా తేల్చింది. మహిళ ఆత్మహత్య కేసులో ఆమె భర్తని అతడి తల్లిదండ్రుల్ని, సోదరుడిని దోషులుగా నిర్ధారించింది. ఈ కేసును విచారించిన హైకోర్టు వీరిని నిర్దోషులుగా ప్రకటించింది. మహిళ తయారు చేసిన భోజనం గురించి అవహేళన చేయడం, ఆమె టీవీని చూడటాన్ని పరిమితం చేయడం, పొరుగింటికి వెళ్లడాన్ని, ఒంటరిగా ఆలయానికి వెళ్లడాన్ని నిషేధించడం, ఆమె కార్పెట్‌పై పడుకునేలా చేయడం వంటివి ఆరోపణలుగా ఉన్నాయి. మరణించిన మహిళ కుటుంబం ఈ ఆరోపణల్ని చేసింది. ఇదే కాకుండా సదరు మహిళని అర్థరాత్రి నీటిని పట్టాలని వేధించాలని ఆరోపించింది. అయితే, కోర్టు విచారణలో మహిళ, ఆమె అత్తమామలు నివసించే ఏరియాలో తెల్లవారుజామున 1.30 గంటలకు నీటి సరఫరా జరుగుతుందని సాక్ష్యులు వెల్లడించారని కోర్టు గుర్తించింది.