- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మిసైల్స్, రాకెట్స్ కాదు.. చెత్తబెలూన్లు, లౌడ్ స్పీకర్లతో కవ్వింపు చర్యలు
దిశ, నేషనల్ బ్యూరో: సౌత్, నార్త్ కొరియాల మధ్య కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. దాని కోసం రెండు దేశాలు కొత్తదారులు వెతుక్కుంటున్నాయి. గత కొన్ని వారాలుగా చెత్తతో నింపిన వందలాది బెలూన్స్ ను నార్త్ కొరియా సౌత్ కొరియాకు పంపుతోంది. ఇటీవల అమెరికాతో కలిసి సియోల్ సైనిక విన్యాసాలు చేపట్టింది. అందులో భాగంగానే నార్త్ కొరియా భూభాగంలో కరపత్రాలు వదిలిపెట్టింది. దీంతో, సియోల్ వైపు కిమ్ సర్కారు చెత్తతో నిండిన బెలూన్లను పంపింది. వెయ్యికిపైగా బెలూన్లు రోడ్లపై పడ్డాయి. అందులోని బ్యాగుల్లో ప్లాస్టిక్ బాటిల్స్, బ్యాటరీలు, పాత షూలు, పేపర్స్, చెత్తను నింపారు. అయితే ఈ చర్యలకు సియోల్ వినూత్నంగా స్పందించింది. సరిహద్దుల్లో పెద్ద పెద్ద లౌడ్‌స్పీకర్లను ఏర్పాటు చేసి ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా ప్రచారం చేపడుతోంది. సైనిక స్థావరాలు ఉన్న ఉత్తర కొరియా ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా కె-పాప్ సంగీతం, విదేశీవార్తలతోపాటు, ప్యాంగ్యాంగ్ వ్యతిరేక ప్రసారాలు చేస్తూ రెచ్చగొడుతోంది.
సియోల్ కు కిమ్ సోదరి వార్నింగ్
ఉత్తర కొరియాలో విదేశీ వార్తలు, కె-పాప్ మ్యూజిక్ వినడాన్ని నేరంగా చూస్తారు. 2015లో ఇలాగే లౌడ్ స్పీకర్లతో సియోల్ ప్రచారం చేయగా.. కిమ్ సర్కార్ మిసైల్స్ తో బదులిచ్చింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మళ్లీ అలాంటి పరిస్థితి ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలని సౌత్ కొరియా రక్షణమంత్రి సైనిక బలగాలకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, లౌడ్ స్పీకర్ల విషయంలో కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ ఫైర్ అయ్యారు. ఈ చర్యలు ఆపకపోతే గతంలో చూడని విధంగా స్పందిస్తామని ప్రకటించారు. ప్రమాదకర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.