- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చైనాతో ద్వైపాక్షిక సంబంధాల గురించి భారత్ ఏమందంటే?
దిశ, నేషనల్ బ్యూరో: భారత్- చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. పరస్పర గౌరవంతోనే సంబంధాలు ఆధారపడి ఉంటాయని తెలిపింది. మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయనున్న మోడీకి చైనా అభినందనలు తెలిపింది. అయితే, చైనా చేసిన ట్వీట్ పై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. నరేంద్రమోడీకి అభినందనలు తెలిపిన చైనాకు ధన్యవాదాలు అని పేర్కొంది. పరస్పర గౌరవం, ఆసక్తి, సెన్సిటివిటీ పైనే భారత్-చైనా సంబంధాలను సాధారణీకరించే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలిపింది. ఈ విషయాన్నే విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇకపోతే, తూర్పు లడఖ్‌లోని ఎల్ఓసీ వెంబడి ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఆ తర్వాత నుంచే భారత్-చైనా మధ్య సంబంధాలు స్తంభించిపోయాయి. ఆ ఉద్రిక్తతలను ఉద్దేశించే విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ కామెంట్లు చేసింది.