దోశ కొంటే సాంబార్ ఇవ్వలేదని కోర్టుకెళ్లిన కస్టమర్.. కోర్టు తీర్పుతో అంతా షాక్!

by Javid Pasha |
దోశ కొంటే సాంబార్ ఇవ్వలేదని కోర్టుకెళ్లిన కస్టమర్.. కోర్టు తీర్పుతో అంతా షాక్!
X

దిశ, వెబ్ డెస్క్: టిఫిన్ చేద్దామని ఓ కస్టమర్ హోటల్ కు వెళ్లాడు. అయితే దోశ తీసుకున్న సదరు కస్టమర్ కు హోటల్ సిబ్బంది సాంబార్ పోయలేదు. దీంతో హర్ట్ అయిన కస్టమర్ కోర్టులో కేసు వేశాడు. కేసు విచారణ చేపట్టిన కోర్టు.. హోటల్ సిబ్బందికి షాక్ ఇచ్చే తీర్పు ఇచ్చింది. ఇంతకు ఏం జరిగిందంటే.. బీహార్ లోని బక్సర్ కు చెందిన మనీశ్ గుప్తా అనే లాయర్ తన బర్త్ డే రోజున మంచి దోశ తిందామని దగ్గర్లోని నమక్ అనే రెస్టారెంట్ కు వెళ్లాడు. అక్కడ రూ.140 కు దోశ పార్సెల్ తీసుకున్నాడు. తీరా ఇంటికి వెళ్లి పార్సెల్ ఓపెన్ చేసి చూస్తే అందులో సాంబార్ లేదు. దీంతో ఆగ్రహానికి గురైన మనీశ్ రెస్టారెంట్ సిబ్బందిని నిలదీశాడు. అయితే వాళ్లు సరిగ్గా స్పందించకపోవడంతో ఆయన కన్స్యూమర్ కోర్టుకెక్కాడు.

దీంతో కేసు విచారించిన కోర్టు.. రెస్టారెంట్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెస్టారెంట్ సిబ్బంది వల్ల కస్టమర్ మానసికంగా, ఆర్థికంగా చాలా వేదనకు గురయ్యాడని అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే కస్టమర్ కు రూ.3,500 ఫైన్ చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ ఫైన్ చెల్లించేందుకు కోర్టు 45 రోజుల గడువు ఇచ్చింది. ఒకవేళ గడువులోగా చెల్లించకపోతే 8 శాతం వడ్డీతో కలిపి మొత్తం చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. కాగా ఈ ఘటన 2022 ఆగస్టు 15న చోటు చేసుకోగా తుది తీర్పును కోర్టు తాజాగా వెలువరించింది.

Advertisement

Next Story

Most Viewed