Delhi: కాలుష్యాన్ని ఏ మతం ప్రోత్సహించదు.. ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

by Shamantha N |
Delhi: కాలుష్యాన్ని ఏ మతం ప్రోత్సహించదు.. ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో(Delhi) పెరుగుతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్రంగా మండిపడింది. ఢిల్లీ పోలీసులపైనా(Delhi Police) నిప్పులు చెరిగింది. అలానే, ఆప్ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీచేసింది. అంతేకాకుండా, వాయుకాలుష్యంపై(Delhi Pollution) కీలక వ్యాఖ్యలు చేసింది. "ఏ మతమూ కాలుష్యాన్ని ప్రోత్సహించదు. ఈ విధంగా పటాకులు పేలితే.. అది పౌరుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది." అని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. నవంబర్ 25లోగా వ్యాపార వర్గాలను సంప్రదించి శాశ్వతంగా బాణసంచా నిషేధించే విషయంపై ఢిల్లీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావాలని సూచించింది.

ఢిల్లీ పోలీసులపై ఆగ్రహం

బాణాసంచా నిషేధాన్ని అమలు చేయడంలో ఢిల్లీ పోలీసులు ఎందుకు విఫలమయ్యారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. “అక్టోబర్ 14 తర్వాత పోలీసులు వెళ్లి టపాసుల అమ్మకాలు ఆపారా?” అని కోర్టు పోలీసులను ప్రశ్నించింది. ప్రతి ఏటా దీపావళి ముందు నిషేధాన్ని ప్రకటిస్తారని.. కానీ అది ఎలాంటి ప్రభావం చూపదని ఫైర్ అయ్యింది. రా మెటీరియల్ మాత్రమే సీజ్ చేసి కంటి తుడుపు చర్యలకు పాల్పడ్డారని ఉన్నతన్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అలానే, బాణసంచా నిషేధాన్ని పక్కాగా అమలు చేసేందుకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ ప్రత్యేక వెబ్ సెల్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

Advertisement

Next Story