Kendriya Vidyalaya: ఎంపీలకు కేంద్రం మరో సారి షాక్.. కేవీల్లో ఎంపీల కోటా పునరుద్ధరణపై క్లారిటీ

by Prasad Jukanti |
Kendriya Vidyalaya: ఎంపీలకు కేంద్రం మరో సారి షాక్.. కేవీల్లో ఎంపీల కోటా పునరుద్ధరణపై క్లారిటీ
X

డైనమిక్ బ్యూరో: దేశంలో ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు పార్లమెంట్ సభ్యుల కోటాను పునరుద్ధరించే ప్రతిపాదన లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. రాజ్యసభలో శివసేన యూబీటీ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది బుధవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జయంత్ చౌధరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్రీయ విద్యాలయాల ప్రవేసాల్లో పార్లమెంట్ సభ్యులకు గతంలో ఇచ్చినట్టుగా కోటాను తిరిగి పునరుద్ధరిస్తే తరగతుల్లో విద్యార్థి-టీచర్ నిష్పత్తి భారీగా పెరిగిపోతున్నదని దీని వల్ల బోధనపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నదని మంత్రి వెల్లడించారు. అందువల్ల ఎంపీ కోటాను పునరుద్ధరించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేశారు.

కాగా గతంలో ఎంపీల కోటాలో భాగంగా కేంద్రీయ విద్యాలయాల్లో ఒక ఎంపీ గరిష్ఠంగా 10 మంది విద్యార్థులను సిఫార్సు చేసే అవకాశం ఉండేది. లోక్ సభ, రాజ్యసభ కలిగి 788 మంది సభ్యులు ఉండగా వీరంతా ఏడాదిలో 7,880 మంది విద్యార్థులను కేవీల్లో తమ కోటా కిందా చేర్పించే విచక్షణాధికారం ఎంపీలకు ఉండేది. ఇక జిల్లా కలెక్టర్లకు సైతం 17 మంది విద్యార్థులను సిఫార్సు చేసే ఛాన్స్ ఉంటేది. దీంతో కోటాలను అమలు చేయడం ద్వారా తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం 2022 ఏప్రిల్ లో వీటిని రద్ధు చేసింది.

Advertisement

Next Story

Most Viewed