మమ్మల్ని ఎవరూ ఆపలేదు: ఇజ్రాయెల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

by samatah |   ( Updated:2024-01-14 05:21:10.0  )
మమ్మల్ని ఎవరూ ఆపలేదు: ఇజ్రాయెల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: హమాస్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధంలో విజయం సాధించే వరకు తమను ఎవరూ ఆపలేరని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గెలిచే వరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదు. అదే మా లక్ష్యం. హేగ్, ఈవిల్ మమ్మల్ని ఏం చేయలేవు’ అని అన్నారు. గాజా భూభాగంలో ఇప్పటికే అనేక హమాస్ బెటాలియన్లను అంతమొందించామని చెప్పారు. ఉత్తర గాజాలో నిర్వాసితులైన వారు తమ ఇళ్లకు తిరిగి రాలేరని తెలిపారు. ఐక్యరాజ్యసమితిలోని అత్యున్నత న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌లో.. ఇజ్రాయెల్ దాడి యూఎన్ఓ జెనోసైడ్ కన్వెన్షన్‌ను ఉల్లంఘిస్తోందని ఇరాన్-మద్దతుగల సాయుధ గ్రూపుల కూటమి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నెతన్యాహు పై కామెంట్స్ చేశాడు. కాగా, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఆదివారం నాటికి 100వ రోజులు చేరుకుంది. ఈ వార్‌లో భారీగా ప్రాణనష్టం జరుగుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed