CM Siddaramaiah: రైతుల భూములకు నాదీ భరోసా.. వక్ఫ్ నోటీసుల వివాదంపై సీఎం

by Mahesh Kanagandla |
CM Siddaramaiah: రైతుల భూములకు నాదీ భరోసా.. వక్ఫ్ నోటీసుల వివాదంపై సీఎం
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక(Karnataka)లోని విజయపుర(Vijayapur) జిల్లాలో సుమారు 1200 ఎకరాల రైతుల భూములను వక్ఫ్ బోర్డు(Waqf Board)కు అప్పగించాలని స్థానిక తహశీల్దారు జారీ చేసిన నోటీసులు కలకలం రేపాయి. ఈ వివాదంపై సిద్ధరామయ్య(CM Siddaramaiah) ప్రభుత్వం వెంటనే వివరణ ఇచ్చింది. వక్ఫ్ బోర్డు నోటీసుల్లో తప్పు దొర్లిందని, రైతుల భూములను ఎవరూ లాక్కోరని ఇది వరకే రాష్ట్ర మంత్రులు స్పష్టత ఇచ్చారు. తాజాగా సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ.. రైతుల నుంచి అక్రమంగా భూములు లాక్కునే చర్యలను తమ ప్రభుత్వం అడ్డుకుని తీరుతుందని, రైతు ప్రయోజనాలకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని సీఎం పునరుద్ఘాటించారు. ఇది వరకే మంత్రులు క్రిష్ణ బైరె గౌడ, ఎంబీ పాటిల్, జమీర్ అహ్మద్ ఖాన్‌లు ఈ వివాదంపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారని వివరించారు.

దీనికితోడు రిజర్వేషన్లపైనా కర్ణాటక ప్రభుత్వం ఓ స్పష్టత ఇచ్చింది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తుతో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి అంతర్గత రిజర్వేషన్లను పరీక్షిస్తుందని వివరించింది. మూడు నెలల్లో ఈ కమిషన్ సమర్పించే నివేదిక ఆధారంగా రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, అప్పటి వరకు కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు వేయబోమని సీఎం సిద్ధరామయ్య తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed