కాంగ్రెస్ కు సుప్రీంలో ఊరట.. ఇబ్బంది పెట్టబోమన్న ఐటీ అధికారులు

by Shamantha N |   ( Updated:2024-04-01 07:44:29.0  )
కాంగ్రెస్ కు సుప్రీంలో ఊరట.. ఇబ్బంది పెట్టబోమన్న ఐటీ అధికారులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఐటీ నోటీసుల విషయంలో కాంగ్రెస్ కు ఎట్టకేలకు ఊరట లభించింది. లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ కు ఇది బిగ్ రిలీఫ్ గా మారింది. రూ.3500 కోట్ల పన్ను బకాయిల విషయంలో జులై 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని సుప్రీంకోర్టు తెలిపింది ఆదాయపన్ను శాఖ.

ఇప్పటికే పన్ను బకాయిలు చూపించి కాంగ్రెస్‌ బ్యాంక్ అకౌంట్స్ నుంచి రూ.135 కోట్లు రికవరీ చేసింది. అయితే దీనిపై కాంగ్రెస్ హైకోర్టుకు వెళ్లగా.. అక్కడ ఎదురుదెబ్బ కలిగింది. దీంతో సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికలు ముగిసే వరకు ఏ పార్టీకి ఆదాయపన్ను శాఖ నుంచి ఇబ్బంది కలగదని తెలిపారు. బకాయిల విషయంలో బలవంతపెట్టబోరని వివరించారు. దీనిపై విచారణను జులై 24కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

ఇక.. 2017-2018 నుంచి 2020-2021 సంవత్సరాలకు సంబంధించి రూ.1,823 కోట్లు చెల్లించాలని కాంగ్రెస్ క నోటీసులు పంపారు అధికారులు. పెనాల్టీ, వడ్డీలతో కలిపి రూ.1,823 కోట్లు చెల్లించాలని మార్చి 29న నోటీసులు పంపింది. రూ.1,744 కోట్లు చెల్లించాలని మార్చి 31న మరోసారి నోటీసులు ఇచ్చింది. మరోవైపు..లోక్‌సభ ఎన్నికల ముందు.. ట్యాక్స్ టెర్రరిజంతో ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతుందని కాంగ్రెస్ పార్టీకి ఈసీ ఫిర్యాదు చేసింది.

Advertisement

Next Story