- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Nitesh Rane: ముస్లిం లీగ్‌కు కాంగ్రెస్ బీ టీమ్.. బీజేపీ నేత నితీశ్ రాణే విమర్శలు
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని బీజేపీ నేత నితీశ్ రాణే(Nitesh Rane) కాంగ్రెస్ పార్టీ (congress party)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హిందువులకు వ్యతిరేకమని ఆరోపించారు. అంతేగాక ముస్లింలీగ్‌కి బీ-టీమ్ గా పని చేస్తోందని వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ మేనిఫెస్టోనే కాంగ్రెస్ కాపీ కొట్టిందని తెలిపారు. మసీదులపై లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేయడంపై మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(MNA) చీఫ్ రాజ్ థాక్రే (Raj Thakraey) చేసిన ప్రకటనను ఆయన సమర్థించారు. ‘మసీదులపై ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లన్నీ చట్టవిరుద్ధం. అది హైకోర్టు(High court) ఆదేశాలను ఉల్లంఘించడమే. మహారాష్ట్రలో మత సామరస్యం ఉండాలంటే. నవరాత్రి లేదా గణేష్ చతుర్థి వంటి పండుగల సమయంలో హిందువులు రాత్రి 10 గంటల తర్వాత సంగీతం ఆడటానికి అనుమతించాలి. హిందువులకు వర్తించే చట్టాలు ముస్లిం సమాజానికి కూడా వర్తింపజేయాలి’ అని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రల శాంతి భద్రతలు అదుపులో ఉండాలన్నారు. కాగా, నితీశ్ రాణే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కంకవ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.