పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో ఎన్‌ఐఏ దాడులు

by Sathputhe Rajesh |
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో ఎన్‌ఐఏ దాడులు
X

దిశ,వెబ్‌డెస్క్: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ శనివారం రాజస్థాన్‌లోని ఏడు లొకేషన్లలో దాడులు నిర్వహిస్తోంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో కనెక్షన్ ఉన్న వారిపై ఆఈ దాడులు కొనసాగుతున్నాయి. రాజస్థాన్‌లోని కోట, సవాయ్ మధుపూర్, బిల్వారా, బుండి, జైపూర్ జిల్లాల్లోని రెసిడెన్షియల్, కమిర్షియల్ ప్రాంతాల్లోఈ దాడులు కొనసాగుతున్నాయి.

దాడుల్లో డిజిటల్ డివైస్ లను, ఎయిర్ గన్, పదునైన ఆయుధాలను సీజ్ చేసినట్లు ఎన్ ఐఏ తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నట్లు తెలిపింది. రాజస్థాన్ లోని బరాన్ జిల్లాకు చెందిన సాదిక్ సరాఫ్, కోటాకు చెందిన మహమ్మద్ ఆసీఫ్ లతో పాటు మరి కొంత మంది చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. 2022 సెప్టెంబర్ 19న వీరి కార్యకలాపాలపై సుమోటోగా కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story