- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రూ.700 కోట్ల డ్రగ్స్ కేసు.. మరో ఏడుగురిపై ఎన్‌ఐఏ ఛార్జిషీటు
దిశ, నేషనల్ బ్యూరో: 2022 సంవత్సరం డిసెంబరులో పంజాబ్‌లోని అతారీ వద్ద రూ.700 కోట్లు విలువైన డ్రగ్స్ దొరికిన కేసులో మరో ఏడుగురిపై ఎన్ఐఏ అనుబంధ ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈవిషయాన్ని ఢిల్లీ ప్రత్యేక కోర్టుకు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఛార్జిషీటులో అథర్ సయీద్, అమృత్ పాల్ సింగ్, అవతార్ సింగ్, హర్విందర్ సింగ్, తహసీమ్, దీపక్ ఖురానా, అహ్మద్ ఫరీద్ పేర్లను చేర్చింది. ఈ ఏడుగురు నిందితులు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు దర్యాప్తులో ఎన్‌ఐఏ గుర్తించింది. డ్రగ్స్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని విదేశాల్లోని ప్రధాన నిందితులకు చేరవేస్తున్నారని వెల్లడైంది. ఈ కేసులో గతంలోనే మరో నలుగురిపై ఎన్ఐఏ ఛార్జిషీటు దాఖలు చేసింది. దాదాపు 100 కేజీల హెరాయిన్‌ను ఆఫ్ఘనిస్తాన్‌లో కొని.. ములేథి మూలికల్లో దాచి పంజాబ్‌లోని అతారీ సరిహద్దు గుండా భారత్‌లోకి తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ములేథి మూలికల మొత్తం దుంగలు 475 కిలోలు ఉండగా.. వాటిలో 102 కిలోల హెరాయిన్ బయటపడింది. రూ.700 కోట్లు విలువ చేసే ఈ డ్రగ్స్ తరలింపు కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఈ కేసులోని ప్రధాన నిందితుడు షాహిద్ అహ్మద్ అలియాస్ ఖాజీ అబ్దుల్ వదూద్ దుబాయ్ కి పారిపోయాడు. ఖాజీ అబ్దుల్ వదూద్ ఆదేశాల మేరకే ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన నజీర్ అహ్మద్ ఖానీ భారత్ లోకి డ్రగ్స్ పంపించినట్లు ఎన్ఐఏ తేల్చింది. ఆ డ్రగ్స్ ను దేశంలోని వివిధ ప్రాంతాల్లోకి మరో నిందితుడు రాజీ హైదర్ జైదీ పంపిణీ చేస్తున్నట్లు గుర్తించారు. 2022 డిసెంబర్ లో ప్రధాన నిందితుడు ఖాజీ అబ్దుల్ వదూద్, నజీర్ అహ్మద్ ఖానీ, రాజీ హైదర్ సహా విపిన్ మిట్టల్ పేర్లను ఎన్ఐఏ ఛార్జిషీటులో చేర్చింది. 2024 మేలో ఈ కేసులో మరో ఐదుగురిని ఎన్ఐఏ అరెస్టు చేసింది.