టోల్‌ ఛార్జీలను 5 శాతం పెంచిన ఎన్‌హెచ్ఏఐ.. రాత్రి నుంచే బాదుడు

by S Gopi |
టోల్‌ ఛార్జీలను 5 శాతం పెంచిన ఎన్‌హెచ్ఏఐ.. రాత్రి నుంచే బాదుడు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలను 5 శాతం మేర పెంచుతూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్ఐఏ) నిర్ణయం తీసుకుంది. పెంచిన ఛార్జీలు జూన్ 3 నుంచి 2025, మార్చి 31 వరకు వర్తిస్తాయని తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. టోల్ ఛార్జీల పెంపు ఇదివరకే ఏప్రిల్ 1 నుంచే అమలయ్యేలా నిర్ణయం తీసుకున్నప్పటికీ దేశవ్యాప్తంగా ఎన్నికల కారణంగా అమలు ఆలస్యమైంది. ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నంచి టోల్ పెంపు అమలవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో పెంపు నిర్ణయాన్ని జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఎన్నికల సంఘం ముందుకు తీసుకెళ్లారు. అయితే, ఎన్నికలు ఉన్న కారణంగా వాయిదా వేయాలని ఎన్‌హెచ్ఏఐ ఆదేశాలిచ్చింది. కాగా, నేషనల్ హైవే నేట్‌వర్క్ కింద సుమారు 855 యూజర్ ఫీజు ప్లాజాలు ఉన్నాయి. వీటిలో జాతీయ రహదారుల రుసుము నియమాలు-2008 ప్రకారం.. టోల్ ఛార్జీలను నిర్ణయిస్తారు. మొత్తం ప్లాజాల్లో 675 పబ్లిక్ ఫండెడ్ ఫీజు ప్లాజాలు, 180 రాయితీదారుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి.

Advertisement

Next Story