- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడు ఆయనే.. ఎంపీ ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: మరికొన్ని రోజుల్లో ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల జరగనున్న వేళ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తదుపరి అధ్యక్షుడే రాహుల్ గాంధీనే అని అన్నారు. కశ్మీర్ టూ కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సమయంలోనే ఏఐసీసీ ఎన్నికలు, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని.. దీంతో మేమంతా రాహుల్ గాంధీని ఒప్పించి ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉండాలని కోరుతామని పేర్కొన్నాడు. గాంధీ కుటుంబయేతర వ్యక్తి ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉంటాడని అనుకోవడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రాహుల్ గాంధీనే కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడు అవుతాడని.. అందులో ఎలాంటి సందేహం లేదని దీమా వ్యక్తం చేశాడు.
ఇక 2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో పేరిట పాదయాత్ర చేపట్టాడు. ఈ యాత్ర ఇవాళ తమిళనాడులోని కన్యాకుమారి నుండి ప్రారంభం కానుంది. మొత్తం 125 రోజుల పాటు ఈ పాదయాత్ర సాగనుంది.