Vande Bharat Sleeper Train:త్వరలో పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్ రైలు

by S Gopi |
Vande Bharat Sleeper Train:త్వరలో పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్ రైలు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత రైలు ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయం మొదలుకానుంది. వందే భారత్ పోర్ట్‌ఫోలియో విస్తరణలో భాగంగా సరికొత్త వందే భారత్ స్లీపర్ రైలు త్వరలో పట్టాలెక్కనుంది. ఈ రైలు అత్యాధునిక టెక్నాలజీ, సౌకర్యాలతో కూడిన రైలు ప్రయాణాన్ని ఇస్తుంది. వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణీకులకు యూరోపియన్ ప్రమాణాలతో సమానంగా ప్రయాణ అనుభవాన్ని అందించడానికి, సుదూర రైలు ప్రయాణంలో విప్లవాత్మక మార్పులతో రూపొందించబడింది. ఈ రైలు గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రపంచ స్థాయి సౌకర్యాలు, ఉన్నతమైన ఇంటీరియర్స్‌తో రూపొందించబడిన వందే భారత్ స్లీపర్ రైలు జతాను ఫంక్షనల్ ఎక్స్‌లెన్స్‌తో ఆకర్షణగా రూపొందించారు. భద్రతకు సంబంధించి కూడా అన్ని పరికరాలు అత్యధిక అగ్నినిరోధక ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తాయి. ముఖ్యంగా దివ్యాంగులకు కూడా అనుకూలమైన బెర్త్‌లు, టాయిలెట్లు రైల్లో ఉంటాయి. రైల్లో ఏసీ 3 టైర్, ఫస్ట్ క్లాస్ ఏ, సీ బెర్త్ వంటి మూరు రకాల బెర్త్‌లు ఉంటాయి. మొత్తం 823 మంది ప్రయాణించేందుకు 16 బెర్త్‌లు ఉంటాయి.

Advertisement

Next Story

Most Viewed