Naveen Patnaik: ఒడిశాలో మత సామరస్యాన్ని పునరుద్దరించాలి.. మాజీ సీఎం నవీన్ పట్నాయక్

by vinod kumar |
Naveen Patnaik: ఒడిశాలో మత సామరస్యాన్ని పునరుద్దరించాలి.. మాజీ సీఎం నవీన్ పట్నాయక్
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మత ఘర్షణలు జరుగుతున్నాయని ఒడిశా మాజీ సీఎం, బిజూ జనతాదళ్(బీజేడీ) చీఫ్ నవీన్ పట్నాయక్ ఆరోపించారు. శాంతికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రంలో ఈ తరహా అల్లర్లు జరగడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని పునరుద్ధరించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. శనివారం ఆయన ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. బీజేపీ పగ్గాలు చేపట్టిన వెంటనే అనేక మతపరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. ఒడిశా శాంతి, సామరస్యానికి ప్రసిద్ధి అని నొక్కిచెప్పిన పట్నాయక్.. దీనిని అలాగే పరిరక్షించాలని చెప్పారు. పూరీలో రథయాత్ర సందర్భంగా ఒక అధికారిపై దాడి చేసి అవమానపరిచిన ఘటనపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. బీజేపీ ప్రభుత్వమే మత ఉద్రిక్తతలను ప్రోత్సహిస్తోందని ఫైర్ అయ్యారు. పూరీలో రథయాత్ర సందర్భంగా లార్డ్ బలభద్ర విగ్రహం కూల్చివేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన దేశంలోని అనేక మంది ప్రజలను బాధపెట్టిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed