మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాలపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..

by Vinod kumar |
మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాలపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
X

న్యూఢిల్లీ: కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మహిళలు, పిల్లలు సురక్షితంగా లేనప్పుడు విజయాలను చేసుకోలేమని అన్నారు. పిల్లల లైంగిక వేధింపుల నేరం తీవ్రమైన, అస్పష్టమైన సవాళ్లలో ఒకటని చెప్పారు. గురువారం ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు.

చట్టపరమైన నిబంధనలను దాటి వెళ్ళవలసి ఉంటుందని, మహిళలు, పిల్లల భద్రతను నిర్ధారించడానికి సమాజం కలిసి రావాలని పిలుపునిచ్చారు. సదస్సు సమయానుకూల మైనదని చెప్పారు. ముఖ్యంగా పిల్లలు ఎదుర్కొంటున్న హింస సమస్యను కేంద్ర మంత్రి నొక్కి చెప్పారు. దీనిని ఎదుర్కొనేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ మరింత చేయాలని కోరారు. అంతకుముందు కేంద్ర మంత్రి ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్‌పర్సన్ సమక్షంలో సదస్సును ప్రారంభించారు. రెండు రోజుల పాటు ఈ సమావేశం జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed