ముస్లిం పర్సనల్ లా బోర్డు అత్యవసర సమావేశం..

by Vinod kumar |
ముస్లిం పర్సనల్ లా బోర్డు అత్యవసర సమావేశం..
X

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్) కి మద్దతుగా మధ్యప్రదేశ్‌లో కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు బుధవారం అర్ధరాత్రి అత్యవసరంగా భేటీ అయింది. "ఒకే దేశంలో రెండు చట్టాలు పని చేయవు.. రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులను ప్రస్తావిస్తున్నది.. సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఏకరీతి చట్టాలను కోరుతున్నాయి" అని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ఈ మీటింగ్‌లో చర్చించినట్టు తెలుస్తోంది. దాదాపు మూడు గంటల పాటు ముస్లిం పర్సనల్ లాబోర్డు సమావేశం జరిగింది.

యూనిఫామ్ సివిల్ కోడ్‌తో ముడిపడిన చట్టపరమైన అంశాలపై డిస్కస్ చేశారు. ఉమ్మడి పౌరస్మృతిపై అభిప్రాయాలను సమర్పించాలని ఇటీవల లా కమిషన్‌ కూడా అన్ని మత సంఘాలను కోరింది. ఈనేపథ్యంలో లా కమిషన్‌కు ఎటువంటి అభిప్రాయం చెప్పాలనే దానిపై ముస్లిం పర్సనల్ లాబోర్డు సభ్యులు చర్చించారు. ఉమ్మడి పౌరస్మృతి అనేది దేశంలోని ప్రతి ఒక్కరికీ వర్తించే మతం ఆధారిత వ్యక్తిగత చట్టాలు, వారసత్వం, దత్తత, వారసత్వ నియమాలను నిర్దేశిస్తుంది. అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 భారతదేశం అంతటా ఒకే విధమైన పౌర కోడ్‌ని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించింది.

Advertisement

Next Story