ఆస్ట్రేలియాలో భారత విద్యార్థి హత్య: కత్తితో పొడిచి చంపిన దుండగులు

by samatah |
ఆస్ట్రేలియాలో భారత విద్యార్థి హత్య: కత్తితో పొడిచి చంపిన దుండగులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆస్ట్రేలియాలో భారత విద్యార్థి హత్యకు గురయ్యారు. కొంతమంది భారతీయ విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో హర్యానాకు చెందిన నవజీత్ సంధు(22)ను కత్తితో పొడిచారు. ఈ విషయాన్ని ఆయన బంధువు యశ్వీర్ వెల్లడించారు. మెల్‌బోర్నులో అద్దె విషయమై ఇద్దరు విద్యార్థుల మధ్య వివాదం నెలకొంది. అయితే ఈ ఘర్షణలో జోక్యం చేసుకునేందుకు నవజీత్ ప్రయత్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన మరో విద్యార్థి నవీజీత్‌ను కత్తితో చాతీపై దారుణంగా పొడవగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దాడిలో నవజీత్ స్నేహితుడైన మరో భారతీయ విద్యార్థి కూడా గాయపడ్డట్టు తెలుస్తోంది. ఈ ఘటన ఆదివారం జరగగా ఆస్ట్రేలియా నుంచి తమకు అధికారులు సమాచారం ఇచ్చినట్టు యశ్వీర్ తెలిపారు. దీంతో నవజీత్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కాగా, ఏడాది క్రితమే నవజీత్ ఎంటెక్ చేసేందుకు ఆస్ట్రేలియా వెళ్లారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఇండియాకు తీసుకురావడానికి సహాయం చేయాల్సిందిగా భారత ప్రభుత్వానికి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ హత్యపై దర్యాప్తు చేపట్టినట్టు ఆస్ట్రేలియాలోని విక్టోరియా పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement

Next Story