పాట్నా హోటల్ లో అగ్నిప్రమాదం ఘటనలో ట్విస్ట్.. కన్నతల్లి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం..

by Prasad Jukanti |
పాట్నా హోటల్ లో అగ్నిప్రమాదం ఘటనలో ట్విస్ట్.. కన్నతల్లి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం..
X

దిశ, డైనమిక్ బ్యూరో: డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారుతున్న రోజుల్లో మనం బ్రతుకున్నాం. తాజాగా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కన్న తల్లి చనిపోయినట్లుగా ఫేక్ సర్టిఫికెట్ క్రియేట్ చేశాడో కన్న కొడుకు. తీరా ఇన్సూరెన్స్ ప్రతినిధుల ఎంక్వైరీ లో అడ్డంగా దొరికిపోయాడు. ఈ తతంగం అంతా దేశంలోనే సంచలనం సృష్టించిన బిహార్ రాజధాని పాట్నా హోటల్ అగ్నిప్రమాదం ఘటనతో ముడిపడటం సంచలనంగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్ 25న పాట్నాలోని ఓ హోటల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 8 మంది దుర్మరణం చెందారు. ఆ సమయంలో మృతదేహాలన్ని గుర్తించిన వాటిని వారి వారి కుటుంబ సభ్యులకు అధికారులు అందజేశారు.

అయితే ఈ ప్రమాదంలో తన తల్లి సుమన్ లాల్ కూడా చనిపోయిందని ఆమె పేరుపై రావాల్సిన రూ.83 లక్షల బీమా సొమ్ము చెల్లించాలని అమెరికా బీమా కంపెనీ నేషనల్ లైఫ్ గ్రూప్‌లో అంకింత్ అనే వ్యక్తి క్లెయిమ్ పత్రాలు సమర్పించాడు. ఈ సందర్భంగా తన తల్లి చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికెట్ సైతం సమర్పించాడు. క్లెయిమ్ సెటిల్ మెంట్ ప్రాసెస్ లో భాగంగా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధి ఒకరు పాట్నాకు వచ్చారు. ప్రమాదం ఘటనకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీసులు, అగ్నిమాపక శాఖ, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల్లో రికార్డులు పరిశీలించగా ఈ ప్రమాదంలో చనిపోయిన వారి జాబితాలో సుమన్ లాల్ అనే మహిళ ఎవరూ లేరని తేలింది. అంతే కాదు బీమా కోసం అంకిత్ సమర్పించిన మరణ ధృవీకరణ పత్రం సైతం ఫేక్ అని తేలింది. దీంతో అతడిపై చర్యలకు సదరు బీమా కంపెనీ ఉపక్రమించింది

Advertisement

Next Story

Most Viewed