- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Bangladesh : బంగ్లాదేశ్ నుంచి తిరిగొచ్చిన 4,500 మంది ఇండియన్స్
దిశ, నేషనల్ బ్యూరో : స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాల వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్‌లో అల్లర్లు కొనసాగుతున్నాయి. ఈ హింసాకాండలో ఇప్పటివరకు 110 మందికిపైగా చనిపోయారు. దీంతో అక్కడి భారతీయులు స్వదేశానికి తిరిగొస్తున్నారు. గత కొన్ని రోజుల వ్యవధిలో 4,500 మందికిపైగా భారతీయులు బంగ్లాదేశ్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేశారని విదేశాంగ శాఖ ప్రకటించింది. బంగ్లాదేశ్‌లో ఉన్న భారత కాన్సులేట్ సహకారంతో దాదాపు 540 మంది నేపాలీలు, 38 మంది భూటానీలు, ఒక మాల్దీవ్స్ వాస్తవ్యుడు కూడా భారత్‌కు చేరుకున్నారు.
వారు భారత్ నుంచి తమ స్వదేశాలకు తిరిగి వెళ్లనున్నారు. ఢాకాలోని భారత హైకమిషన్ కార్యాలయం చొరవ చూపి వీరందరినీ ప్రత్యేక ఎస్కార్ట్ నడుమ సరిహద్దు క్రాసింగ్ పాయింట్ల వద్ద ల్యాండ్ చేయించే ఏర్పాట్లు చేసిందని విదేశాంగ శాఖ తెలిపింది. బంగ్లాదేశ్‌లో దాదాపు 8,500 మంది విద్యార్థులు సహా మొత్తం 15,000 మంది భారతీయులు ఉన్నారని వెల్లడించింది.