కేరళను తాకిన రుతుపవనాలు..తీర ప్రాంతాలను అప్రమత్తం చేసిన ఐఎండీ

by vinod kumar |
కేరళను తాకిన రుతుపవనాలు..తీర ప్రాంతాలను అప్రమత్తం చేసిన ఐఎండీ
X

దిశ, నేషనల్ బ్యూరో: భారతదేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు గురువారం ఉదయం కేరళను తాకినట్టు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. అలాగే ఈశాన్య భారతదేశంలోని చాలా ప్రాంతాలకూ విస్తరించినట్టు పేర్కొంది. నైరుతి రుతుపవనాలు రెమాల్ తుపాన్ ప్రభావంతో సాధారణ తేదీ కంటే రెండు రోజుల ముందుగానే ప్రారంభమయ్యాయని పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం, మణిపూర్ అసోంలలో సాధారణ రుతుపవనాలు జూన్ 5న ప్రారంభమవుతాయని ఐఎండీ అంచనా వేసింది. రుతుపవనాల రాకతో కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తీర ప్రాంతాలను ఐఎండీ అప్రమత్తం చేసింది.

నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న కేరళలో ప్రారంభమవుతాయి. అనంతరం రెండు రోజుల తర్వాత ఈశాన్య ప్రాంతానికి చేరుకుంటుంది. కానీ ప్రస్తుతం కేరళ, ఈశాన్య ప్రాంతాల్లో రుతుపవనాలు ఒకేసారి రావడం గమనార్హం. చివరిగా ఏడేళ్ల క్రితం 2017 మే 30న ఇలాంటి పరిణామం చోటు చేసుకుంది. కాగా, భారతదేశ వ్యవసాయానికి రుతుపవనాలు ఎంతో కీలకం. ఎందుకంటే నికర సాగు విస్తీర్ణంలో 52 శాతం దానిపైనే ఆధారపడి ఉంది. అంతేగాక దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి, తాగునీటికి కీలకమైన రిజర్వాయర్లను నింపడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. జూన్, జూలైలను వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైన రుతుపవన నెలలుగా పరిగణిస్తారు.

Advertisement

Next Story

Most Viewed