ఎన్డీయే పక్షనేతగా మోడీ ఏకగ్రీవ ఎన్నిక.. కొనసాగుతున్న ఇండియా కూటమి భేటీ

by Prasad Jukanti |
ఎన్డీయే పక్షనేతగా మోడీ ఏకగ్రీవ ఎన్నిక.. కొనసాగుతున్న ఇండియా కూటమి భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్డీయేపక్ష నేతగా నరేంద్ర మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఎన్డీయే కూటమి నేతలు ఇవాళ ఢిల్లీలోని మోడీ నివాసంలో భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు కొనసాగిన ఈ సమావేశంలో కూటమి పార్టీలు తదుపరి కార్యాచరణకు అవసరమైన కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, నరేంద్ర మోడీ, అమిత్ షా, చంద్రబాబు, పవన్ కల్యాణ్, నితీశ్ కుమార్, కుమార స్వామితో పాటు కూటమికి చెందిన వివిధ పార్టీ నేతలు హాజరయ్యారు. మోడీకి మద్దతు తెలుపుతూ నేతలు సంతకాలు చేశారు. ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం చేయొద్దని నితీశ్ సూచించినట్లు సమాచారం. కాగా మరికాసేపట్లో ఎన్డీయే నేతలు రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీలో చంద్రబాబును మోడీ తన పక్కనే కూర్చోబెట్టుకోవడం గమనార్హం.

ఇండియా కూటమి నేతల భేటీ

మరో వైపు ఢిల్లీలో ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కొనసాగుతున్న భేటీలో ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక, అఖిలేశ్, తేజస్వీ యాదవ్, స్టాలిన్, సంజయ్ రౌత్, శరద్‌పవార్, చంపా సోరెన్, అఖిలేశ్‌యాదవ్, అభిషేక్ బెనర్జీ, సీతారాం ఏచూరి, డి.రాజా తదితర నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed