- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసిన మోడీ..
దిశ, వెబ్ డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కేవలం 240 సీట్లు మాత్రమే సాధించింది. ఈ క్రమంలో ప్రధాని మోడీ రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని తన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అలాగే ఈ నెల 8 వ తేదీన కూటమి సభ్యుల బలంతో మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. అయితే గతంలో బీజేపీ సొంతంగా 303 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఈ సారి ఆ పరిస్థితులు లేకపోవడంతో ఎన్డీయే కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలో మోడీ బుధవారం రాష్ట్రపతికి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అలాగే జూన్ 8 ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ప్రధాని ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు గాను 7వ తేదీన ఎన్డీఏ కూటమి సమావేశం నిర్వహించి సాయంత్రానికి ప్రభుత్వ ఏర్పాటుకు పిలుపునివ్వాలని ఎన్డీఏ కూటమి సభ్యులు రాష్ట్రపతిని కోరనున్నారు. కాగా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 292 స్థానాలు వచ్చాయి. ఇందులో టీడీపీ 16 , జేడీయూ 12 , లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్)కు 5 స్థానాలతో కీలకంగా మారనున్నాయి.