- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇందిరా పాలనను తీసుకొస్తున్నారు.. మోడీ ప్రభుత్వంపై ఒవైసీ మండిపాటు
న్యూఢిల్లీ: ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకపడ్డారు. దేశంలో ఇందిరాగాంధీ శకాన్ని వెనక్కి తీసుకువస్తున్నారని ఆరోపించారు. జడ్జిల నియమాకాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, రాజ్యాంగ నిర్మాణంపై చేస్తున్న కామెంట్లతో కేంద్రాన్ని విమర్శించారు. బుధవారం పార్లమెంటు రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగంలో ఆయన మాట్లాడారు. మైనారిటీలకు కావాల్సినంతగా ప్రభుత్వం చేయలేకపోతుందని ఆరోపించారు. భారత్-చైనా సరిహద్దుల్లో కేంద్ర వైఖరిపై ఆందోళన లేవనెత్తారు. 'రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రాథమిక నిర్మాణంపై వ్యాఖ్యానిస్తున్నారు.. కొలిజియంపై న్యాయమంత్రి వ్యాఖ్యలు చేశారు. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ బిల్లు వచ్చినప్పుడు అది రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి వ్యతిరేకంగా ఉంటుందని చెప్పిన ఏకైక ఎంపీ నేను' అని ఒవైసీ అన్నారు.
ఇందిరాగాంధీ పాలన నుంచి గుణపాఠం నేర్చుకోవాలని హితవు పలికారు. 'ఇందిరా న్యాయవ్యవస్థ తనని అనుసరిస్తుందని చెప్పారు. ఇప్పుడు ప్రధాని న్యాయవ్యవస్థను తనకు విధేయంగా ఉండాలని అంటున్నారు. ఇలాంటి చర్యలతో ఇందిరా గాంధీ శకాన్ని వెనక్కి తీసుకొస్తున్నారు అని అన్నారు. మైనారటీలకు బడ్జెట్ లో తగిన కేటాయింపులు చేయలేకపోయిందని విమర్శించారు. దాదాపు 40 శాతం కోత విధించారని చెప్పారు. దేశంలో 19 శాతం ఉన్న మైనారిటీల గురించి కనీసం రాష్ట్రపతి ప్రసంగంలో కూడా చోటు లేకపోయిందని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ముస్లిం పిల్లలను చదువుకోనివ్వదని, వారి పేదరికంలోనే ఉంచేలా చూస్తుందని మండిపడ్డారు. గత 20 ఏళ్లుగా న్యాయపోరాటం చేస్తున్న బిల్కిస్ బానోకు నిరాశే ఎదురైందని.. ఆమె పేరే దానికి కారణమని అన్నారు. భారత్-చైనా సరిహద్దు పరిస్థితులను గమనిస్తే చైనాకు భారత్ భయపడుతుందని ఆరోపించారు.