- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చైనా, భారత్ సరిహద్దు వివాదం.. ప్రధానిపై Rahul Gandhi సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: భారత సరిహద్దు విషయంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ భారత భూభాగాన్ని ఎటువంటి ఫైట్ లేకుండా చైనాకు ఇచ్చేశారని రాహుల్ గాంధీ బుధవారం ట్విట్టర్ వేదికగా మోడీపై విమర్శలు చేశారు. అంతకాకుండా పాత స్థితిని పునరుద్దరించేందుకు చైనా నిరాకరించిందని రాహుల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 'ఏప్రిల్ 2020 నాటి భూభాగ స్థితిని పునరుద్దరించాలని భారత్ కోరినప్పటికీ అందుకు డ్రాగన్ కంట్రీ నిరాకరించింది. చైనాతో ఎటువంటి ఫైట్ చేయకుండా ప్రధాని మోడీ వెయ్యి చదరపు కిలోమీటర్లు భారత భూభాగాన్ని చైనాకు ఇచ్చేశారు' అని రాహుల్ రాసుకొచ్చారు.
అయితే ఇటీవల సరిహద్దు పెట్రోల్ పాయింట్ 15 నుంచి ఇరు దేశాల మిలటరీ ట్రూప్స్ వెనుదిరగనున్నాయని ఇరు దేశాల అధికారులు తెలిపారు. లడాఖ్‌లోని గోగ్ర హాట్‌స్ప్రింగ్స్ నుంచి తమ దళాలను భారత్, చైనా దళాలు వెనుదిరిగాయి. అయితే ఇదే తరహాలో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకున్నా మోడీ మౌనం పాటిస్తున్నారంటూ సుబ్రమణియన్ అన్నారు. దీంతో ఇప్పుడు రాహుల్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారుతోంది. మరి దీనిపై బీజేపీ త్వరలో ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.