ప్రతి ఒక్కరు తమ తల్లి పేరు మీద మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన మోడీ

by Harish |   ( Updated:2024-06-30 08:09:16.0  )
ప్రతి ఒక్కరు తమ తల్లి పేరు మీద మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ ఆదివారం తన నెలవారీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్'ను పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, 2024 సార్వత్రిక ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలని అన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత పెద్ద ఎన్నికలు జరగలేదు, దాదాపు 65 కోట్ల మందికి పైగా ప్రజలు ఈ ఎన్నికల్లో ఓటు వేశారని తెలిపారు. దీని కోసం తీవ్రంగా కృషి చేసిన ఎన్నికల సంఘాన్ని మోడీ అభినందించారు.

ఈ కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ, ఆయన తన తల్లిని గుర్తు చేసుకున్నారు. తల్లి పేరు మీద చెట్టును నాటడం అనే కొత్త సంప్రదాయానికి తెరలేపారు. నేను కూడా నా తల్లి పేరు మీద ఒక మొక్కను నాటాను. అలాగే దేశ ప్రజలందరూ తమ తల్లులను గౌరవించేలా, ప్రతి ఒక్కరు తమ తల్లి పేరు మీద మొక్కను నాటాలని మోడీ పిలుపునిచ్చారు. ఇంకా, శనివారం జరిగిన టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌లో భారత జట్టు విజయం సాధించడాన్ని ప్రత్యేకంగా మోడీ ప్రస్తావించారు. ఈ సందర్బంగా ఆయన భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే, వచ్చే నెలలో జరగనున్న పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొననున్న భారత అథ్లెట్ల గురించి కూడా ప్రధాని మాట్లాడారు. భారత అథ్లెట్లు 900కు పైగా అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తారని దేశం ఆశిస్తున్నదని, వారిని ప్రోత్సహించాలని ప్రజలను కోరారు. కేరళలో తయారు చేయబడిన ప్రత్యేకమైన గొడుగుల గురించి మోడీ ఈ కార్యక్రమంలో ప్రస్తావించారు. కేరళ సంస్కృతిలో గొడుగులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అక్కడ అనేక సంప్రదాయాలు, ఆచారాలలో గొడుగులు ముఖ్యమైన భాగం అని మోడీ చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్‌ అరకు లోయలోని ప్రత్యేక కాఫీ గురించి కూడా మోడీ దీనిలో మాట్లాడారు. ఇది గొప్ప రుచి, సువాసనకు ప్రసిద్ధి చెందిందని ఆయన అన్నారు.

Advertisement

Next Story

Most Viewed