ముస్లింలు, కాంగ్రెస్ మేనిఫెస్టోపై కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

by Dishanational4 |
ముస్లింలు, కాంగ్రెస్ మేనిఫెస్టోపై  కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఓ మైనారిటీ వర్గంపై ఇటీవల రాజస్థాన్ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. తాజాగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా అదేబాటలో పయనించారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనలో ఆ పార్టీ హస్తం గుర్తుతో పాటు విదేశీ శక్తుల హస్తం కూడా ఉందని ఆయన ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ హస్తం, విదేశీ శక్తుల హస్తం కలిసి మీ పిల్లల ఆస్తులను ముస్లింలకు ఇవ్వాలని చూస్తున్నాయి. మనం దేశం అణ్వాయుధాలను అంతం చేయాలని భావిస్తున్నాయి. కులతత్వం, ప్రాంతీయ తత్వంతో మన దేశాన్ని విభజించాలని ప్రణాళిక రచిస్తున్నాయి’’ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. ‘‘తుక్డే-తుక్డే గ్యాంగ్ కాంగ్రెస్‌ పార్టీని పూర్తిగా చుట్టుముట్టింది. కాంగ్రెస్ భావజాలాన్ని హైజాక్ చేసింది. మీ పిల్లలకు చెందాల్సిన ఆస్తి ముస్లింలకు దక్కాలా అనేది మీరే నిర్ణయించుకోవాలి. మేం ముస్లింలకు అన్ని హక్కులను సమానంగా ఇచ్చాం. కానీ మతకోణంలో వారిని ఎన్నడూ చూడలేదు’’ అని అనురాగ్ ఠాకూర్ చెప్పుకొచ్చారు.



Next Story

Most Viewed