డ్రైవర్ లేని కార్ల అనుమతిపై స్పష్టత ఇచ్చిన రవాణశాఖ మంత్రి.. ఏమన్నారంటే..?

by Indraja |
డ్రైవర్ లేని కార్ల అనుమతిపై స్పష్టత ఇచ్చిన రవాణశాఖ మంత్రి.. ఏమన్నారంటే..?
X

దిశ వెబ్ డెస్క్: ప్రస్తుతం టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. మనిషి మేదస్సుకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదని నాటి నుండి నేటి వరకు మనిషి నిరూపిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మనిషి చేసిన మరో ఆవిష్కరణ సర్వత్రా ప్రశంసదాయకంగా మారిది. అదే డ్రైవర్లు లేకుండానే నడిచే కారు. అయితే మనిషి చేసే పని మరో మనిషికి నష్టాన్ని కలిగించకూడదు అనేది భారతీయులు సిద్దాంతం.

ప్రపంచ ఖ్యాతి కన్నా సాటి మనిషి ఆకలిని అవసరాన్ని అర్థం చేసుకోవడమే ముఖ్యం. అదే మనకు మన పూర్విలకు నేర్పింది. ఇదే విషయాన్ని రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరొసారి నిరూపించారు. తాజాగా డ్రైవర్లు లేని కార్లను అనుమతింపై ప్రసంగించిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పదవిలో ఉన్నంత వరకు డ్రైవర్లు లేని కార్లను అనుమతించనని తేల్చి చెప్పారు. ఆ కార్లు దేశంలోకి వస్తే దాదాపు 80 లక్షల మంది డ్రైవర్లు రోడ్డున పడతారని, అందుకే వాటిని తాను అనుమతించనని స్పష్టం చేశారు.

Advertisement

Next Story