జ్ఞానవాపి ప్రాంగణంలో అర్ధరాత్రి పూజలు: యూపీలో అలర్ట్

by samatah |
జ్ఞానవాపి ప్రాంగణంలో అర్ధరాత్రి పూజలు: యూపీలో అలర్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలోని హిందూ దేవుళ్ల విగ్రహాల ముందు ప్రార్థనలు చేసుకోవచ్చని వారణాసి జిల్లా కోర్టు బుధవారం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో అదే రోజు అర్ధరాత్రి మసీదు ప్రాంగణంలో పూజలు చేపట్టారు. దీపం వెలిగించి గణేష్-లక్ష్మీ హారతి నిర్వహించారు. నేలమాళిగ గోడపై ఉన్న త్రిశూలంతో సహా ఇతర మతపరమైన చిహ్నాలకూ పూజలు చేశారు. జ్ఞానవాపి ప్రాంగణంలో విష్ణుమూర్తి విగ్రహం, గణేష్ విగ్రహం, రెండు హనుమంతుడి విగ్రహాలు ఉన్నట్టు తెలుస్తోంది. అంతకుముందు కోర్టు తీర్పు తర్వాత యూపీలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎటువంటి ఘర్షణలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించకుండా పర్యవేక్షణ చేపట్టారు.

31ఏళ్ల తర్వాత పూజలు

కోర్టు తీర్పు వెలువడ్డాక జ్ఞానవాపి ప్రాంగణాన్ని అధికారులు పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య 9:30 గంటలకు విశ్వనాథ ఆలయ తూర్పు ద్వారం నుంచి కాశీవిశ్వనాథ ట్రస్టు ఉద్యోగులతో కలిసి బారికేడ్లను తొలగించారు. అనంతరం రాత్రి 11గంటలకు కాశీ విశ్వనాథ ట్రస్టు పూజారి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. కాగా, 31 ఏళ్ల తర్వాత మసీదు ప్రాంగణంలో పూజలు నిర్వహించడం గమనార్హం. మరోవైపు కోర్టు తీర్పును విశ్వహిందూ పరిషత్ స్వాగతించగా..దీనిని హైకోర్టులో సవాల్ చేస్తాయని ముస్లిం వర్గం తరఫు పిటిషనర్లు తెలిపపారు.

Advertisement

Next Story