రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఎంపీల సమావేశం

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-24 06:45:19.0  )
రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఎంపీల సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్ : రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణ, ఏపీ, కర్ణాటక ఎంపీల సమావేశం ప్రారంభమైంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతోంది. అభివృద్ధి చేస్తున్న రైల్వే స్టేషన్ల పురోగతి, ఎంపీ నియోకవర్గాల వారీగా రైల్వే అభివృద్ధిపై సమీక్షా సమావేశంలో చర్చించనున్నారు. రైళ్ల హాల్టింగ్, కొత్త రైల్వే లైన్లు, రైల్వే అండర్ బ్రిడ్జిలు, అండర్ పాస్ ల సమస్యలను అధికారుల దృష్టికి ఎంపీలు తీసుకెళ్ళి వాటికి సంబంధించనున్న ప్రతిపాదనలు అందించనున్నారు. రైల్వే బడ్జెట్ లో ఇచ్చిన హామీలు, కేటాయింపుల మేరకు చేపట్టాల్సిన పనులపై చర్చిస్తారు.

ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం సమర్పించనున్న బడ్జెట్ లో రైల్వే కేటాయింపులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇందులో జోన్లు, రాష్ట్రాల వారీగా నిధులు, ప్రాజెక్టుల మంజూరు తదితరాలు ఉంటాయి. జోన్ల వారీగా నిధుల కేటాయింపు, ప్రాజెక్టుల మంజూరుపై ఆయా రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు, ఎంపీల ఒత్తిడి కీలక పాత్ర పోషిస్తుంది. సమావేశంలో ఎంపీలతో పాటు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి, ఎంపీలు కావ్య, రఘునందన్ రావు, డీకే. అరుణ ఉన్నతాధికారులు, రైల్వే బోర్డు సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు వెల్లడికావాల్సి ఉంది. తెలంగాణ, కర్ణాటక ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే సమావేశం మొదలైంది.

Advertisement

Next Story

Most Viewed