YS Jagan:షర్మిల, విజయమ్మ పిటిషన్‌ పై టీడీపీ విమర్శలు.. స్పందించిన మాజీ సీఎం జగన్

by Jakkula Mamatha |   ( Updated:2024-10-24 09:17:01.0  )
YS Jagan:షర్మిల, విజయమ్మ పిటిషన్‌ పై టీడీపీ విమర్శలు.. స్పందించిన మాజీ సీఎం జగన్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ(TDP), వైసీపీ(YCP) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే ఈ రోజు(గురువారం) వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) విజయనగరం జిల్లా(Vijayanagaram) గుర్లలో పర్యటించారు. ఈ క్రమంలో ఇటీవల గుర్లలో డయేరియా(Diarrhea) బారిన పడి మృతి చెందిన కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హమీలను ఎప్పుడు అమలు చేస్తారని ఆయన ప్రశ్నించారు.

ఈ క్రమంలో ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్(Politics of diversion) ఆపి హామీలను అమలు చేయాలన్నారు. ఏ వివాదాన్ని అయిన జగన్ పేరు చెప్పి డైవర్ట్ చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో తన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ పై వేసిన పిటిషన్‌ నేపథ్యంలో టీడీపీ చేస్తున్న విమర్శలపై మాజీ సీఎం జగన్(YS Jagan) స్పందించారు. ‘ఇవన్నీ అన్ని ఇళ్లలో ఉండేవే. కుటుంబ వ్యవహారాలను రాజకీయం చేస్తారా? మా తల్లి, చెల్లి, నా ఫొటోలు పెట్టి డైవర్ట్ చేస్తున్నారు. అయ్యా చంద్రబాబు .. మీ ఇళ్లలో ఇలాంటి గొడవలు లేవా? వీటిని నీ స్వార్థం కోసం పెద్దవి చేసి చూపించడం మానుకొని, ప్రజా సమస్యలపై దృష్టి సారించండి’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు.

Advertisement

Next Story