యూజర్లకు షాక్.. జొమాటో బాటలోనే స్విగ్గీ

by Rani Yarlagadda |   ( Updated:2024-10-24 09:16:44.0  )
యూజర్లకు షాక్.. జొమాటో బాటలోనే స్విగ్గీ
X

దిశ, వెబ్ డెస్క్: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అనగానే గుర్తొచ్చేవి.. స్వి్గ్గీ, జొమాటో (Swiggy, Zomato). ఈ రెండు ఫుడ్ డెలివరీ యాప్స్ ప్రజలకు బాగా అలవాటయ్యాయి. పండుగల సమయంలో ప్రత్యేక ఆఫర్లిస్తూ.. తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాయి. పిజ్జా, బర్గర్, బిర్యానీ, కేక్స్, స్నాక్స్, మీల్స్, సాఫ్ట్ డ్రింక్స్, స్వీట్స్, జ్యూస్, షేక్స్.. ఇలా అన్నిరకాల ఫుడ్.. ఆర్డర్ చేయడమే ఆలస్యం.. నిమిషాల్లో ఇంటి గుమ్మానికి డెలివరీ చేస్తున్నాయి.

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఇటీవలే ప్లాట్ ఫాం ఫీజును పెంచింది. తాజాగా స్వి్గ్గీ కూడా అదే బాటలో నడిచింది. ప్లాట్ ఫాం ఫీజును పెంచుతున్నట్లు ప్రకటించి యూజర్లకు షాకిచ్చింది. యాప్ ఓపెన్ చేయడంతోనే హైదరాబాద్ లో ప్లాట్ ఫామ్ ఫీజు ఆర్డర్ పై రూ.10 కనిపిస్తోంది. అయితే ఇది నగరాల వారిగా వ్యత్యాసం ఉండనుంది. ఇటీవలే జొమాటో ప్లాట్ ఫామ్ ఫీజు పెరిగిందన్న వార్తలు రాగా.. అవన్నీ రూమర్లని నెటిజన్లు కొట్టిపారేశారు. దానిపై స్పందించిన జొమాటో సంస్థ.. ప్లాట్ ఫామ్ ఫీజు పెంచిన మాట వాస్తవమేనని చెప్పింది. పండుగల సీజన్లో సేవలందించేందుకు ప్లాట్ ఫామ్ ధర పెంచినట్లు చెప్పింది. అయితే ఏయే నగరాల్లో ఎంతెంత ప్లాట్ ఫామ్ ఫీజును పెంచిందో మాత్రం క్లారిటీగా చెప్పలేదు. ఇప్పటికే ఈ రెండు సంస్థలు ఆదాయాన్ని పెంచుకునేందుకు అనేకసార్లు ఫీజుల్ని పెంచిన విషయం తెల్సిందే.

Advertisement

Next Story

Most Viewed