- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLC జీవన్ రెడ్డి ఆవేదనను సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవాలి
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ కీలక నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(Jeevan Reddy) ఆవేదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పట్టించుకోవాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula Prashanth Reddy) పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో జీవన్ రెడ్డి చాలా సీనియర్ లీడర్, అలాంటి వ్యక్తిని ఇబ్బందులకు గురిచేయడం కరెక్ట్ కాదు. ఆయన బాధను పట్టించుకోవాలి. పార్టీలు ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని తెలిపారు. అంతకుముందు పాదయాత్రగా శబరి బయలుదేరిన అయ్యప్పు స్వాములు ప్రశాంత్ రెడ్డిని కలిశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి ఎమ్మెల్యేగా వేముల ప్రశాంత్ రెడ్డి విజయం సాధిస్తే పాదయాత్రగా శబరికి వస్తానని మొక్కుకున్న భీమ్‌గల్ మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేష్ చేంగల్ గ్రామం నుండి 5 రోజుల క్రితం పాదయాత్ర ప్రారంభించి బయలుదేరి గురువారం కొంపల్లికి చేరుకోవడంతో వారిని కొంపల్లి రాముని దేవాలయంలో కలిసిన ప్రశాంత్ రెడ్డి వారితో కలిసి పూజలో పాల్గొన్నారు. పాదయాత్రలో జాగ్రత్తలు పాటించాలి, ముఖ్యంగా రాత్రిపూట తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్వాములను కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ శుభిక్షంగా ఉండాలని ఆ శబరిమల అయ్యప్పను నా తరపున ప్రార్థించండి అని అన్నారు.