- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రూడో రాజీనామాకు సొంత పార్టీ ఎంపీల పట్టు
దిశ, వెబ్ డెస్క్ : భారత్ వ్యతిరేకిగా మారిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఎదరువుతోంది. ఆయన రాజీనామా చేయాలని 24 మంది లిబరల్ పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు. అక్టోబర్ 28 వరకు డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది. ట్రూడో రాజీనామా చేయాలన్న లేఖపై మొత్తం 153 మంది ఎంపీల్లో 24 మంది సంతకాలు చేశారని కెనడా బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ వెల్లడించింది. ఇప్పటికే మైనార్టీలో ఉన్న ప్రభుత్వానికి ఇది మరింత సవాలుగా మారనుంది. లిబరల్ పార్టీ నిర్వహించిన అంతర్గత సమావేశంలో ఎంపీలు ట్రూడో రాజీనామా డిమాండ్ ను వినిపించారని ట్రూడో సన్నిహితుడిగా పేరున్న ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ మీడియా ముందు వెల్లడించడం విశేషం.
ఈ ఏడాది జూన్, సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో పార్టీ దెబ్బతినడానికి ప్రధాని ట్రూడో వైఖరే కారణమని పార్టీ సమావేశంలో ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారని, ఎన్నికల్లో ఏం జరిగిందనే విషయాన్ని ఎంపీలు నిజాయితీగా ప్రధానికి వెల్లడించారని మిల్లర్ తెలిపారు. వచ్చే ఏడాది కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో చేపట్టిన సర్వేల్లో ట్రూడో నేతృత్వంలోని లిబరల్ ప్రభుత్వం వెనకంజలో ఉంది. ఈ నేపథ్యంలో ట్రూడోకు సొంత పార్టీలో అసమ్మతి పెరుగుతోంది. అయితే దేశ వాసుల్లో తన ప్రభుత్వం పట్ల ఆదరణ పెంచుకునేందుకు ట్రూడో ప్రభుత్వం దేశంలోకి అనుమతించే వలసదారుల సంఖ్యను భారీగా తగ్గించేందుకు సిద్దమవ్వడం చర్చనీయాంశమైంది.