- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ragging: మెడిసిన్ స్టూడెంట్ ను బలితీసుకున్న ర్యాగింగ్ భూతం..
దిశ, వెబ్ డెస్క్: సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ (Ragging) చేయడం నేరమని ఎంత చెప్పినా.. కొన్ని కాలేజీలను ఈ భూతం వీడటం లేదు. తాజాగా గుజరాత్ (Gujarat) లోని పఠాన్ జిల్లా ధార్పూర్ లో జీఎంఈఆర్ఎస్ మెడికల్ కాలేజ్ (GMERS Medical College) అండ్ హాస్పిటల్ లో సీనియర్లు చేసిన ర్యాగింగ్ తట్టుకోలేక .. ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుతున్న 18 ఏళ్ల అనిల్ నత్వర్ భాయ్ మెతానియా మరణించాడు. శనివారం (నవంబర్ 16) రాత్రి సీనియర్స్ అతడిని 3 గంటల సేపు నిలబెట్టారు. దీంతో అతను స్పృహ తప్పి పడిపోయాడు. ఆ తర్వాత అతడికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటన దేశంలో కలకలం రేపింది. ర్యాగింగ్ ను బ్యాన్ చేసినా.. ఇంకా విద్యాసంస్థల్లో అదే కల్చర్ కొనసాగడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఈ ఘటనపై కాలేజీ డీన్ హార్దిక్ తెలిపిన వివరాల ప్రకారం.. అనిల్ ను చికిత్సకు తీసుకొచ్చే సరికే అతను స్పృహ కోల్పోయి ఉన్నాడు. ఆక్సిజన్ అందించి చికిత్స చేసేలోపే మరణించాడు. అతనిని తీసుకొచ్చిన వారిని అడగ్గా.. 3 గంటలసేపు నిలబెట్టడంతో స్పృహ కోల్పోయినట్లు చెప్పారు. కాలేజీ హాస్టల్ లో సీనియర్లకు తనను తాను పరిచయం చేసుకునే క్రమంలో ర్యాగింగ్ కు గురయ్యాడు. కాలేజీలో ఉన్న యాంటీ ర్యాగింగ్ కమిటీ ఈ ఘటనపై విచారణ ప్రారంభించిందని, త్వరలోనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. సుమారు 7-8 మంది సీనియర్ల గ్రూప్ జూనియర్లను ఇదే మాదిరిగా ర్యాగింగ్ చేసినట్లు తెలిసిందన్నారు. అందరినీ గంటల తరబడి నిలబెట్టారని, వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.
మృతుడి సోదరుడు ధర్మేంద్ర మెథానియా.. అనిల్ మృతిపై విచారం వ్యక్తం చేశారు. నెలరోజుల క్రితమే అనిల్ కాలేజీలో ఎన్నో ఆశలతో చేరాడని, డాక్టర్ గా తిరిగి వస్తాడనుకుంటే ఇలా ర్యాగింగ్ కు బలయ్యాడని వాపోయారు. తమకు కాలేజీ యాజమాన్యం, ప్రభుత్వం న్యాయం చేస్తుందని భావిస్తున్నామన్నారు. కాగా.. అనిల్ మృతదేహానికి పోస్టుమార్టం చేయాల్సి ఉంది. అందులోనే అతని మృతికి గల కారణాలేంటో తెలుస్తాయని పేర్కొన్నారు. డిప్యూటీ ఎస్పీ కేకే పాండ్యా ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు. ప్రస్తుతం యాక్సిడెంటల్ డెత్ గా కేసు రాశామని, పోస్టుమార్టం తర్వాత.. కేసుపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి, నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు.