Army Recruitment :133 పోస్టులు.. పోటెత్తిన 18వేల మంది.. ఫుట్‌పాత్‌పైనే కొందరి నిద్ర

by Hajipasha |
Army Recruitment :133 పోస్టులు.. పోటెత్తిన 18వేల మంది.. ఫుట్‌పాత్‌పైనే కొందరి నిద్ర
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్ టెర్రిటోరియల్ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌(Army Recruitment) కోసం నిరుద్యోగ యువత పోటెత్తారు. 133 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేయగా 18వేల మందికిపైగా అభ్యర్థులు ఉత్తరాఖండ్‌(Uttarakhand)లోని పితోర్‌ఘర్ నగరానికి చేరుకున్నారు. నవంబరు 22, 23 తేదీల్లో దేహ దారుఢ్య పరీక్షలు జరగనుండటంతో సుదూర ప్రాంతాల అభ్యర్థులు ముందుగానే ఇక్కడికి చేరుకున్నారు. అభ్యర్థుల రద్దీ ఇంతలా ఉండటానికి అసలు కారణం మరొకటి ఉంది. అదేమిటంటే.. ఉత్తరప్రదేశ్ టెర్రిటోరియల్ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను బిహార్‌లోని దానా‌పూర్‌లో నిర్వహిస్తామని ఆర్మీ అధికారులు తొలుత ప్రకటించారు. అయితే అకస్మాత్తుగా ఉద్యోగ భర్తీ వేదికను ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్‌కు మార్చారు.

దీనిపై తగిన సమాచారం లేకపోవడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా పితోర్‌ఘర్‌కు అదనపు బస్సులేవీ నడపలేకపోయింది. దీంతో అభ్యర్థులు వ్యయప్రయాసల కోర్చి ఇక్కడికి చేరుకున్నారు. ఒక్కసారిగా వేలాది అభ్యర్థులు పితోర్‌ఘర్‌కు బయలుదేరడంతో.. యూపీ - ఉత్తరాఖండ్ సరిహద్దు జిల్లాల ప్రైవేటు వాహనదారులు ఛార్జీలను అమాంతం పెంచేశారు. ఆయా జిల్లాల నుంచి పితోర్‌ఘర్‌కు వెళ్లే ప్రతీ పది మంది అభ్యర్థులకు కలిపి సగటున రూ.10వేల దాకా వసూలు చేశారు. ఒక్కసారిగా వేలాది అభ్యర్థులు పితోర్‌ఘర్‌కు చేరుకోవడంతో.. అధికార యంత్రాంగం వాళ్లందరికీ సరిపడా వసతి ఏర్పాట్లను చేయలేకపోయింది. దీంతో కొందరు అభ్యర్థులు చలి వాతావరణంలో రోడ్ల పక్కన ఫుట్‌పాత్‌లపై నిద్రించారు.

Advertisement

Next Story

Most Viewed