Manish Sisodia: మనీష్ సిసోడియాకు షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు.. బెయిల్ పిటిషన్ కొట్టివేత

by Shiva |
Manish Sisodia: మనీష్ సిసోడియాకు షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు.. బెయిల్ పిటిషన్ కొట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు బిగ్ షాకిచ్చింది. లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ సిసోడియా దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. అదేవిధంగా సిసోడియా అధికార దుర్వినియోగం చేశారని, ప్రజా విశ్వాసాన్ని భంగపరిచారంటూ కోర్టే ఆక్షేపించింది. కాగా, ఆమ్‌ ఆద్మీ పార్టీ కీలక నేత మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని మే 31 వరకు పొడిగిస్తూ మంగళవారం ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఉత్వర్వులు జారీ చేసింది. అయితే, సిసోడియా ఈ కేసులో ఫిబ్రవరి 2023 నుంచి జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed