- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Mamata Mohanta: బీజేడీకి భారీ షాక్.. పార్టీకి రాజ్యసభ ఎంపీ మోహంత రిజైన్
దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బిజూ జనతాదళ్(బీజేడీ)కి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యురాలు మమతా మోహంత పార్టీతో పాటు తన పదవికి బుధవారం రిజైన్ చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు తన రాజీనామా లేఖ అందజేయగా.. ఆయన వెంటనే ఆమోదం తెలిపారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించారు. అంతకుముందు మోహంత ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు లేఖ రాశారు. ‘నేను బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. ఇన్ని రోజులు నాకు అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మయూర్‌భంజ్ ప్రజలకు సేవ చేయడంతోపాటు జాతీయ స్థాయిలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అయితే బీజేడీకి ప్రస్తుతం నా సేవల అవసరం లేదని భావిస్తున్నా. అందుకే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నా’ అని పేర్కొన్నారు.
బీజేపీలో చేరే చాన్స్!
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మమతా మోహంత బీజేపీలో చేరే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఒడిశా అసెంబ్లీలో బీజేపీకి మెజారిటీ ఉండటంతో ప్రస్తుత రాజీనామాతో జరగనున్న ఉప ఎన్నికలో ఆమె మరోసారి బీజేపీ తరఫున ఎన్నికయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.