- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మమతా బెనర్జీ జాతీయ భద్రతతో రాజీ పడుతున్నారు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
దిశ, నేషనల్ బ్యూరో: ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జాతీయ భద్రతతో రాజీ పడుతున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. రాష్ట్ర జనాభాను మార్చేందుకు చొరబాటుదారులను అనుమతిస్తున్నారని విమర్శించారు. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని కంఠిలోఎన్నికల ర్యాలీ సందర్భంగా అమిత్ షా ప్రసంగించారు. ‘చొరబాటుదారులకు బెంగాల్ స్వర్గధామంగా మారింది. చొరబాటు కారణంగా రాష్ట్ర జనాభా పెరుగుతోంది. ఇది బెంగాల్‌నే కాకుండా మొత్తం దేశాన్ని ప్రభావితం చేస్తోంది. చొరబాటుదారులను అనుమతించడం ద్వారా మమతా బెనర్జీ పాపం చేస్తున్నారు. అంతేగాక దేశ భద్రతతో రాజీ పడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు.
తృణమూల్ కాంగ్రెస్ త్వరలోనే విచ్ఛిన్నం అవుతుందని, రాష్ట్రంలో 30 లోక్‌సభ స్థానాలను బీజేపీ గెలుచుకున్న తర్వాత మమతా బెనర్జీ ప్రభుత్వానికి వీడ్కోలు పలుకుతామని తెలిపారు. రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ్ సంఘ్‌లో కొంతమంది సన్యాసులు బీజేపీ సూచనల మేరకు పనిచేస్తున్నారని ఇటీవల మమతా చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా స్పందించారు. టీఎంసీ ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునేందుకు ఈ సామాజిక-మత సంస్థలను బెదిరింపులకు గురి చేస్తోందని చెప్పారు. మమతా బెనర్జీ భారత్ సేవాశ్రమ్ సంఘంపై దాడి చేస్తున్నారు. కానీ ఆ సంఘం లేకుంటే బెంగాల్ బంగ్లాదేశ్‌లో భాగమై ఉండేదని ఆమెకు తెలియదని చెప్పారు.
Read More..
ఢిల్లీలో బీజేపీ నీటి సంక్షోభం సృష్టించాలని చూస్తుంది: మంత్రి అతిషి