- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Maldives President: ఆ ప్రభావం మా ఆర్థిక వ్యవస్థపై పడింది..మాల్దీవుల టూరిజంపై ముయిజ్జు కీలక వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో: మాల్దీవుల(Maldives) టూరిజంపై అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత టూరిస్టులు ( Indian Tourists) తమ దేశంలో పర్యటించాలని ఆహ్వానించారు. భారత పర్యటకుల ప్రభావం తమ ఆర్థిక వ్యవస్థపై ఉందని అన్నారు. ‘‘భారత భద్రతను బలహీనపరిచేలా మాల్దీవులు వ్యవహరించదు. భారత్ మాకు విలువైన భాగస్వామి. రక్షణ సహా ఇతర రంగాల్లో ప్రాధాన్యం ఉంటుంది. మేం వివిధ రంగాల్లో ఇతర దేశాలతో సహకారాన్ని పెంచుకునేటప్పుడు.. మాల్దీవుల చర్యలు మా ప్రాంత భద్రత, స్థిరత్వంపై రాజీ లేకుండా ఉండేలా చూసుకుంటాం. పొరుగుదేశాలు, స్నేహితులపై గౌరవంతో వ్యవహరించడం మా డీఎన్‌ఏలో ఉంది’’ అని వెల్లడించారు. అంతర్జాతీయ సంబంధాల్లో వైవిధ్యతను చూపడం మాల్దీవులకు చాలా అవసరమని ముయిజ్జు చెప్పుకొచ్చారు. అలాగే ఏ ఒక్క దేశం పైనా అతిగా ఆధారపడటం తగ్గించుకోవాల్సి ఉందని అన్నారు.
భారత టూరిస్టులకు ఆహ్వానం
ముయిజ్జు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల భారత్- మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి టైంలో ముయిజ్జు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలాఉంటే.. ముయిజ్జు అక్టోబర్ 10 వరకు భారత్‌లో పర్యటన కొనసాగనుంది. ఇటీవల ఇరుదేశాల మధ్య తలెత్తిన దౌత్య విభేదాల తర్వాత.. ముయిజ్జు భారత్‌కు రావడం ఇది రెండోసారి. ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఇతర దేశాధినేతలతో పాటు హాజరయ్యారు. ఆ తర్వాత ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆగస్టులో మాల్దీవుల్లో పర్యటించి ముయిజ్జుతో చర్చలు జరిపారు.