National Politics: బీజేపీ వల్లనే నా ఇల్లును, ఆరోగ్యాన్ని కోల్పోయా.. మహువా మోయిత్రా

by Indraja |
National Politics: బీజేపీ వల్లనే నా ఇల్లును, ఆరోగ్యాన్ని కోల్పోయా.. మహువా మోయిత్రా
X

దిశ వెబ్ డెస్క్: గత లోక్‌సభ సమావేశాల నుంచి ఎంపీ మహువా మొయిత్రాను కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ అంశంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఇటీవల స్పంధించారు. తనను సస్పెండ్ చేయడం కారణంగానే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కేవలం 63 స్థానాలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. సోమవారం జరిగిన చర్చల్లో ఆమె పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ‘నాడు శ్రీకృష్ణుడు ద్రౌపదిని రక్షించినట్లే నేడు కృష్ణానగర్‌లోని ప్రజలు నన్ను రక్షించారు.’ అని అన్నారు. బీజేపీ కారణంగా తన లోక్‌సభ సభ్యత్వంతోపాటుగా ఢిల్లీలోని తన ఇంటిని, అలానే తన గర్భాశయాన్ని సైతం కోల్పోయినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. అలానే ‘“నేను ఏమి సంపాదించానో మీకు తెలుసా? భయం నుండి విముక్తి. ఇకపై నేను మీకు భయపడను.

మీ ED, CBI, ఆదాయపు పన్ను శాఖ, మీరు కొనుగోలు చేసిన న్యాయమూర్తులు మమ్మల్ని భయపెట్టలేరు. సోషల్ మీడియాలో మాపై వస్తున్న ట్రోల్స్‌కి సైతం బెదరం” అని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story